డాక్టర్ కడియం కావ్య ఎంపీని కలిసిన తెలంగాణ కళాకారులు

59చూసినవారు
డాక్టర్ కడియం కావ్య ఎంపీని కలిసిన తెలంగాణ కళాకారులు
హన్మకొండ జిల్లా బుధవారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యని వారి నివాసంలో తెలంగాణ కళాకారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ నంది అవార్డు గ్రహీత వెన్నమల్ల వెంకటేష్ గత పది సంవత్సరాల నుండి నిరుద్యోగ కళాకారుల గోసను ఎంపీకి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు పాలేటి రాజు, బీరు సురేందర్, నాగుల సుధాకర్, కొండపర్తి రాజు, తదితర కళాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్