పారాఅథ్లెట్ దీప్తి జీవాంజికి కేంద్రం అర్జున అవార్డు ప్రకటించడంతో గురువారం దీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లా కల్లెడలో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. దేశానికి గర్వకారణంగా నిలిచిన దీప్తికి అర్జున అవార్డు రావడం సంతోషంగా ఉందని దీప్తి తల్లి ధనలక్ష్మి అన్నారు. ఉద్యోగంతో పాటు కోటి రూపాయలు ప్రకటించిన ప్రభుత్వానికి. అర్జున అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.