వర్ధన్నపేట: కాలి బూడిదైన పూరి గుడిసె

53చూసినవారు
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జంగాల కాలనిలో కడెం రాజు తండ్రి మల్లయ్య గుడిసెలు వేసుకొని జీవన సాగిస్తున్నారు. ఆదివారం రాజు భార్య నాగమణి పూజ చేసి దీపం వెలిగించి మంచినీరు పట్టడం కోసం బయటకి వెళ్ళింది. ఇంట్లో మంటలు చెలరేగి గుడిసె కాళీ లోపల ఉన్న బట్టలు, బియ్యం, దాచుకున్న డబ్బులు దాదాపు 70 వేల రూపాయలు కాలి బుడిదయ్యాయని బాధితుడు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఏమైనా సహాయం అందజేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్