వరంగల్ జిల్లా కలెక్టర్ వరంగల్ ఆయిల్ ఫామ్ సాగు పై దృష్టి సారించాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం జిల్లా పరిధిలోని సంగెం మండలం గవిచర్ల సమీపంలో గల రామచంద్రపురంలో ఆయిల్ ఫామ్ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆయిల్ ఫామ్ మొక్కలను నర్సరీల్లో విస్తృతంగా పెంచుతున్న రైతులతో కలెక్టర్ ముచ్చటించారు. జిల్లాలో 3600 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు.