పర్వతగిరి మండల కేంద్రంలో దళిత మోర్చా అధ్యక్షులు ఏడేళ్ళి సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్ హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పెట్టారన్నారు.