సోమవారం బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బన్న ప్రభాకర్ శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గుండెకారి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.