ఇందిరమ్మ ఇళ్ల కోసం రాజకీయ నాయకులకు ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే వారికి ఇళ్లు రద్దు చేస్తామని వర్ధన్నపేట MLA నాగరాజు హెచ్చరించారు. డబ్బులు తీసుకున్నది ఎంతటివారైనా ఖచ్చితంగా జైలుకు పంపిస్తానని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో MLA మాట్లాడుతూ.. ఇళ్లకు డబ్బులు అడిగితే డయల్ యువర్ MLAకు కాల్ చేయాలని సూచించారు. అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే తమ లక్ష్యమన్నారు.