రైతును రాజు చేయడం కోసమే ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని అందులో భాగంగా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు, తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం కాజీపేట మండలం టేకులగూడెంలో ఐకెపి సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజ్ ముఖ్యఅతిథిగా, ఆత్మీయ అతిథిగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జండా రాఘవరెడ్డి పాల్గొన్నారు.