డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారి నుండి సెల్ ఫోన్, వాహనాన్ని లాక్కుంటున్నారని వాహనదారులు వాపోయారు. సోమవారం రాత్రి వర్ధన్నపేట నుండి రామవరం బైక్ పై వెళ్తున్న కుటుంబాన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పేరుతో బండిని ఆపి, తన కుటుంబ సభ్యుల ముందే కించపరుస్తూ ఎస్సై చందర్ తనపై చేయి చేసుకున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళ , పిల్లలు సైతం వేడుకున్న కనికరం కూడా లేకుండా బైకు లాక్కొని లైట్లు లేని నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.