వర్ధన్నపేట: 'సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'

51చూసినవారు
వర్ధన్నపేట: 'సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య హాజరై ప్రసంగించారు. 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను తీసుకొచ్చిన చట్టాలను బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్