వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గత సంవత్సరం తన భర్త చనిపోగా తమకున్న ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పల్లి గ్రామంలోని మహమ్మద్ బుడే సాయబ్ కుతిలి భేగం కు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు. వీరికి సంబంధించి దాదాపు 5 ఎకరాలు ఉండగా ఒక ఎకరం ముప్పై గుంటల భూమిని ఒకరికి చొప్పున వారి తలిదండ్రులు నిర్ణయించారు. మాషుక్ చనిపోయి సంవత్సరం పూర్తి కాగా వారికి ఉన్న ఆస్తిని కాజేయాలని హుస్సేన్ వారిని చిత్ర హింసలకు గురిచేస్తున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు పట్టించుకోని మమ్ములను చిత్రహింసలకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.