వరంగల్ అజంజాహి మిల్లు భూములపై జ్యుడీషియల్ విచారణ జరిపించి, భూములను కాపాడాలని కోరుతూ శుక్రవారం వివిధ ప్రజా సంఘాల నాయకులు అధికారులను కోరారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గోధుమల కుమార్ స్వామి, వర్ధన్నపేట నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షులు గోపనబోయిన రాజు, ముఖ్య సలహాదారులు బరిగల కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.