సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకురావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా అన్నారు. శనివారం వరంగల్ ఓ సిటీ స్టేడియం లో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. 6000 మంది క్రీడాకారులు 31 ఈవెంట్లలో పాల్గొని గెపుపొంది రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొననున్నారని తెలిపారు.