పర్వతగిరి మండలంలోని ఏనుగల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటిలో మెట్లు కట్టుతుండగా ఐరన్ రాడ్ అవసరం వచ్చి బయట ఉన్న ఐరన్ రాడ్ తీసుకు రావడానికి వెళ్లి ప్రమాదవశాత్తు 11 కెవీ వైరు తగిలి మాసాని దిలిప్ (20) మృతి చెందారు. పర్వతగిరి ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకి మాసాని దిలీప్ తండ్రి రవి ఏనుగల్ గ్రామం చర్చి పక్కన గల తన ఇంటిలో మెట్లు కట్టుతుండగా ఐరన్ రాడ్ అవసరం వచ్చి బయట ఉన్న ఐరన్ రాడ్ తీసుకురావడానికి వెళ్లగా రాడ్ ని పైకి లేపేసరికి పైన ఉన్న 11 కేవీ వైరు ప్రమాదవశాత్తు ఆ రాడ్ కి తగలడం వల్ల కరెంట్ షాక్ కొట్టి హాస్పిటల్ కి తీసుకు వచ్చాక నిన్న సాయంత్రం మరణించినట్లు తెలిపారు.