జమ్మూకశ్మీర్‌లో పక్కా ప్లాన్ ప్రకారమే ఉగ్రదాడి జరిగినట్టు తెలుస్తోంది. 38 రోజుల పాటు కొనసాగే అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది యాత్రికులు అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం మార్గం 48 కి.మీ నుంచి, గండేర్బల్ జిల్లాలోని 14కి.మీ మార్గం నుంచి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పర్యటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.