సముద్ర తీరంలో స్నానాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న అలల ధాటికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. తాజాగా బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలోని బీచ్‌లో సందర్శకులు సేదదీరారు. ఆ సమయంలో 3 మీటర్ల పొడవు ఉంటే భారీ అల తీరం వైపు వచ్చింది. ఆ సమయంలో బీచ్‌లో స్నానం చేస్తున్న వారంతా అలకు కొట్టుకుపోయారు. అదృష్టవశాత్తూ వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.