సమైక్య రాష్ట్రంలో నీళ్లు ఇవ్వక తెలంగాణను ఎండబెట్టారని.. కరెంట్ ఇవ్వక కాల్చుకు తిన్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం మొదలైందని కేటీఆర్ గుర్తుచేశారు. 'నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఆనాడు మేం ఉద్యమాన్ని నడిపాం. సీఎం రేవంత్ TG ప్రయోజనాల కోసం కాకుండా AP ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు. బనకచర్ల పేరుతో ఆంధ్రకు నీళ్లు పంపుతున్నారు. నిధులను ఢిల్లీకి పంపుతున్నారు. ఆయన తొత్తులు కొంతమందికి నియామకాలు ఇస్తున్నారు' అని ఆరోపించారు.