చిన్న వర్షం వస్తే హైదరాబాద్‌లోని రోడ్లపై గంటల తరబడి నీరు ఆగిపోతుందని సీఎం రేవంత్ అన్నారు. చిన్న వర్షానికే ఉస్మానియా ఆసుపత్రి మునిగిపోయిందని చెప్పారు. పేదలు తమ కాలనీ వైపు రాకుండా కొందరు బలవంతంగా అడ్డుగోడలు కడుతున్నారని మండిపడ్డారు. 'హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు రూ.10 వేలు ఇస్తామన్నారు. రూ.10 లక్షలు నష్టపోతే రూ.10 వేలు ఇస్తారా?' అని ప్రశ్నించారు. హైడ్రా PS, వాహనాలు, వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించి మాట్లాడారు.