10% అధిక వర్షపాతం కారణంగా వయనాడ్ విలయం: తాజా అధ్యయనం

68చూసినవారు
10% అధిక వర్షపాతం కారణంగా వయనాడ్ విలయం: తాజా అధ్యయనం
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడడంతో పెను విషాదం సంభవించింది. ఈ ఘోర విపత్తులో దాదాపు 400కు పైగా మృతి చెందారు. కాగా, ఈ విపత్తు భారీ వర్షపాతం కారణంగా సంభవించినట్టు వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ విశ్లేషించింది. వాతావరణ మార్పుల కారణంగా 10% వర్షాలు ఎక్కువగా కురిశాయని అధ్యయనం తెలిపింది. వయనాడ్ జిల్లాలో ఒక్క రోజులో 140 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిందని వివరించింది.