కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నాం: కేంద్ర వైద్యశాఖ

64చూసినవారు
కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నాం: కేంద్ర వైద్యశాఖ
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య శాఖ స్పందించింది. కరోనా కేసులపై తాము అప్రమత్తంగా ఉన్నామని, పేర్కొంది. కరోనా కేసుల నమోదుపై సమీక్ష చేస్తున్నట్లు తెలిపింది. ‘‘ కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదుపై సమీక్షించాం. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన వారు ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నారు’’ అని ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్