మావోయిస్టుల ఏరివేతకు కట్టుబడి ఉన్నామని సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి నక్సలిజాన్ని అంతం చేసే దిశగా భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని CRPF డీజీ జీపీ సింగ్ వెల్లడించారు. 2014లో నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 126 ఉండగా.. 2025 నాటికి అది 18కి పడిపోయినట్లు GP సింగ్ తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోల కోసం భద్రతాబలగాల వేట కొనసాగుతోందన్నారు.