మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులను విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ అగ్రనేత జగన్ పేరిట ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్‌ను దృష్టిలో పెట్టికొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.