TG: ఎస్సీ వర్గీకరణ ద్వారా మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలను నెరవేరుస్తున్నట్లు సీఎం రేవంత్ అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రజా ప్రభుత్వం వేసిన కొన్ని అడుగులు ఇవి అంటూ Xలో ట్వీట్ చేశారు. 'విద్యా, ఉద్యోగ, స్థానిక రాజకీయాల్లో బడుగు బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టరూపం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, రైతులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక భరోసా, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, నేడు భూ భారతికి శ్రీకారం చుట్టడం' అని రాసుకొచ్చారు.