TG: రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.."తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలి. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేసుకోవాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్దిదారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో బహిర్గతం చేయాలి. 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలి. " అని ఆదేశించారు.