పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 'అప్పులు ఉన్నాయని తెలుసు.. అందుకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ పరిపాలించే అనుభవం ఉంది. ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పెద్దన్న లాగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం ఉండాలి. అందమైన భవనాలు కట్టి తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉందని చూపెట్టే ప్రయత్నం చేశారు' అని విమర్శించారు.