తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము హిందీకి వ్యతిరేకం కాదని తెలిపారు. భాషా ఉద్యమం తమిళనాడు సరిహద్దును దాటి మహారాష్ట్రకు చేరిందంటూ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ ప్రభుత్వం మరాఠీ ప్రజలపై హిందీ రుద్దుతుందనే కారణంతో 20 ఏళ్ల విభేదాలను పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒక్కటయ్యారు. ఈ క్రమంలో 'వాయిస్ ఆఫ్ మరాఠీ' పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. దీనికి సీఎం స్టాలిన్ సైతం మద్దతు తెలిపారు.