రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: సీఎం చంద్రబాబు

80చూసినవారు
రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: సీఎం చంద్రబాబు
AP: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోలో పాల్గొన్న సీఎం ఈ మేరకు మాట్లాడారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో నిర్మాణరంగం పాత్ర కీలకమన్నారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, తాము వచ్చాక ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you