ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వతంత్య్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పారు. యూపీఏ హయాంలో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం ఒక్కసారి కూడా రుణమాఫీ చేయలేదని.. కేసీఆర్ పదేళ్ల పాలనలో కూడా అది జరగలేదని చెప్పారు. తెలంగాణలో చరిత్ర సృష్టించామన్నారు.