అధికారం అడ్డుపెట్టుకొని తప్పులు చేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు కాషాయ బుక్‌లో రాస్తున్నామని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. వరంగల్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాము కూడా 'ఆరెంజ్ బుక్' మెయిన్‌టైన్ చేస్తున్నామన్న ఈటల.. ఆ బుక్‌లో అందరి పేర్లు రాసుకుంటున్నామన్నారు. ఎల్లకాలం కాంగ్రెస్ అధికారంలో ఉండదని... సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు.