ఇరాన్‌లోని అణ్వాయుధ ప్రాజెక్ట్ టార్గెట్లపై వరుస దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. అలాగే ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేసినట్లు ట్వీట్ చేసింది. దాడుల సమయంలో సైరన్లు మోగిపోవడంతో వేలాది ఇజ్రాయెలీలు షెల్టర్లవైపు పరుగులు తీశారు. మరోవైపు, ఇరాన్ కూడా మిస్సైల్స్‌తో ప్రతిదాడులు చేస్తూ ఇజ్రాయెల్‌పై కక్ష తీర్చుకుంటోంది.