ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేశామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ భారీ నష్టాలను చవిచూసిందని చెప్పింది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ఉన్నత సలహాదారుడు అలీ షంకానీ మరణించాడు.