యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి విద్యార్థికి విద్య అనేది శక్తివంతమైన ఆయుధం లాంటిదని, విద్య నేర్చుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్‌లో నేర్చుకున్న మెలకువలు, నైపుణ్యాలను తమ భవిష్యత్తు కోసం విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు.