AP: ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలపై పాక్ ఆర్మీ దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో ఉరి, రాజౌరీ, పూంఛ్, అఖ్నూర్ ప్రాంత ప్రజలను భారత సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ ఆయా ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. పాక్‌ను నమ్మలేమని, ఏ క్షణమైనా ఫైరింగ్ జరిగే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు.