తెలంగాణ అసెంబ్లీలో BRS మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. 'జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు దురహంకారానికి నిదర్శనం. బడుగులను అవమానించేలా బీఆర్‌ఎస్ నేతలు ప్రవర్తించారు. గవర్నర్‌ను కాంగ్రెస్ కార్యకర్త అని అవమానించారు. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జగదీష్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి' అని స్పీకర్‌ను కోరారు.