TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని, అయినా తెలంగాణకు సంబంధం లేని గుజరాత్ వ్యాపారులు ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చుతారంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించాలనే తాము కోరుకుంటున్నామన్నారు. మరోసారి కాంగ్రెస్‌ను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.