TG: ‘ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఎన్నికల్లో చెప్పాం. అన్నట్లుగానే దాని స్థానంలో రాబోయే వందేళ్ల వరకు ఉండేలా భూ భారతి తెచ్చాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘రెవెన్యూ యంత్రాంగమంతా గ్రామాల్లోకి వస్తారు. తహశీల్దార్ తన బృందంతో రోజంతా ఉంటారు. జూన్ 30లోపు నాలుగు పైలట్ ప్రాజెక్ట్ మండలాల్లోని సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించాం’ అని మంత్రి తెలిపారు.