తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువే చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదు. మాకు మాటలు రావనుకున్నారా? ఇవాళ మాట్లాడటం మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి, కూలగొడతామంటూ భయపెడతారా? అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.