ఏడాదిలో 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం: భట్టి

79చూసినవారు
ఏడాదిలో 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం: భట్టి
గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. పెద్దపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. 'ఏడాదిలో 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. మరికొన్ని నియామకాలు కొనసాగుతున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లతో యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నాం. పెద్దపల్లిలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. గత ప్రభుత్వం శ్మశానాల నిర్మాణాన్ని కూడా పెద్ద కార్యక్రమంగా చెప్పుకున్నారు' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్