ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం: కేసీఆర్

82చూసినవారు
ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం: కేసీఆర్
TG: పద్మశ్రీ అవార్డు గ్రహిత వనజీవి రామయ్య మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రామయ్య మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని అన్నారు. పర్యావరణం కోసం రామయ్య త్యాగం అసమాన్యమని, హరితహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన అందించిన సహకారం గొప్పదని పేర్కొన్నారు. కాగా రామయ్య మృతి పట్ల ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్