అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ అధికారిక ఎక్స్ ఖాతా బ్లాక్ అవ్వడంపై ఏర్పడిన గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. భారత్ ఆంక్షలకు అనుగుణంగా రాయిటర్స్ ఖాతా నిలిపేశామని ఎక్స్ ప్రకటించిన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. ‘రాయిటర్స్ బ్యాన్ గురించి మాకు ఎలాంటి సంబంధం లేదు. కమ్యూనికేషన్ లోపం వల్ల ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు ఎక్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు.