యూత్‌ను పూర్తిస్థాయిలో అలరించేలా తాము 'లైలా' సినిమాను తెరకెక్కించామని నటుడు విశ్వక్ సేన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తాను, ఆకాంక్షశర్మ జంటగా నటించిన 'లైలా' చిత్రానికి సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చిందని విశ్వక్ తెలిపారు. తమ చిత్రానికి ఆ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందో సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులకు తెలుస్తుందన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది.