TG: భారీ వర్షాలు వరదల నిర్వహణకు HYD తరహాలోనే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదల నిర్వహణపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటి నుంచే పకడ్భందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.