అక్కినేని నాగచైతన్య-సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరోయిన్ సాయిపల్లవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో హీరోయిన్ కోసం మొదట సాయిపల్లవిని అనుకున్నాను. ఓ మలయాళ కోఆర్డినేటర్‌తో కూడా మాట్లాడాను’ అని గుర్తుచేసుకున్నారు.