డీఎన్‌ఏ టెస్టులు చేశాకే మృతుల గురించి ప్రకటిస్తాం: అమిత్ షా

60చూసినవారు
డీఎన్‌ఏ టెస్టులు చేశాకే మృతుల గురించి ప్రకటిస్తాం: అమిత్ షా
అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో డీఎన్‌ఏ టెస్టులు చేశాకే మృతుల గురించి ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. విమానంలో 230మంది ప్రయాణికులు ఉన్నారు. 12మంది సిబ్బంది ఉన్నారు. విమాన ప్రమాదం నుంచి ఒకరు క్షేమంగా బయటపడినట్లు తెలిసింది. అతడిని కలిశాను. మృతుల గురించి తెలుసుకొనేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేస్తున్నాం.’’ అన్నారు.

సంబంధిత పోస్ట్