TG: భూముల సర్వేకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘కర్ణాటకలో 17 వేల మంది ప్రైవేటు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించారు. తెలంగాణలో తొలి దశలో ఐదారు వేల మందిని నియమించుకుంటాం. వారికి 90 రోజులపాటు జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి.. లైసెన్సులు ఇస్తాం. భూభారతి అమల్లోకి వచ్చాక.. రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పోర్టల్‌ను అభివృద్ధి చేస్తాం’ అని మంత్రి చెప్పారు.