'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. 'మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు యాదృచ్ఛికంగా ఒకటి జరిగింది. మొదట 150 మేకలున్నాయని చెప్పారు. చివరికి ఎన్ని ఉన్నాయని లెక్కిస్తే కరెక్ట్ 11 ఉన్నాయి' అని తెలిపారు. దీంతో వైసీపీని ట్రోల్ చేశారని ఆ పార్టీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తామంటూ Xలో పోస్టులు పెడుతున్నారు.