నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పొంగులేటి

85చూసినవారు
నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పొంగులేటి
TG: నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం మెదక్ జిల్లాలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.."గత ప్రభుత్వంలో కట్టడం ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను. పేదవారికి ఇళ్లు నిర్మించాలన్న దృఢసంకల్పంతో రాష్ట్రంలో మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇళ్లు అందిస్తున్నాం. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం." అని అన్నారు.

సంబంధిత పోస్ట్