AP: ‘అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం’ అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ అంజలి ఘటించారు. మోడీ నేతృత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ట్విట్టర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. కూటమి పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తామని పవన్ స్పష్టం చేశారు.