ఢిల్లీలో బీజేపీదే అధికారమంటూ చాలా వరకు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. ఈ క్రమంలో బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆప్ తిరస్కరించింది. గత మూడు ఎన్నికల్లోనూ ఆప్‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాలేదని ఆ పార్టీ నేత సుశీల్ గుప్తా తెలిపారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.