వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తాం: సీఎం చంద్రబాబు

65చూసినవారు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తాం: సీఎం చంద్రబాబు
TG: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. తెలుగుజాతి సమగ్ర వికాసమే తమ పార్టీ లక్ష్యమన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని.. తెలుగు జాతి కోసం పనిచేస్తామన్నారు. తాను అరెస్టయినప్పుడు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ ప్రకటన తెలంగాణలోని టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుంది.

సంబంధిత పోస్ట్